Wednesday, 27 February 2013

మౌన సముద్రపు ఘోష ..


యుద్దం నడుస్తోంది..ఎన్నాళ్ళిలా..? నాకు తెల్సు జీవిత కాలమని...? 

నీవు చేసిన మోసానికి నీవు మిగిల్చిన గాయాలకు 
నిశ్శబ్దం లేపనంగా మారి మాయం చేస్తుంది..

జరిగిన నిజం తెల్సుకునే రోజుకోసం..అసలు నిజం తెల్సినరోజు ..
కార్చే కన్నీటి బొట్టులో అబద్దం కొట్టుకుపోతుందని ఎదురు చూస్తున్నా..

కానీ ఆనిజం ఎప్పటికీ తెల్సుకోలేవని..
తెల్సుకునే ప్రయత్నం చేయవనేది గట్టినమ్మకం..

అదీ గమనిస్తున్నా నిశ్శబ్దంగా..

నిశ్శబ్దమే నా నిజమైన బలం, నిశ్శబ్దం నా దుఖ్ఖం హరించే ధ్యానం 
ఆవేశానికి కోపతాపాలకు సిసలైన సమాధానం నిశ్శబ్దం



No comments:

Post a Comment